Meenakshi Chaudhary: మంచి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్న నటి మీనాక్షి చౌదరి ఈసారి మరో హిట్‌తో ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది “విజయ్ గోట్”, “లక్కీ భాస్కర్” చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ భామ, తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఇంటర్వ్యూలో మీనాక్షి సంచలన వ్యాఖ్యలు
ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్కూల్ డేస్‌లో తనకు ఒక టీచర్ మీద క్రష్ ఉండేదని సింపుల్‌గా పేర్కొన్నారు.
“మనందరికీ స్కూల్ లేదా కాలేజ్ టైంలో ఎవరో ఒకరిపై క్రష్ ఉండటం సాధారణమే. అది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకూ ఉంటుంది. నా స్కూల్ టైంలో ఒక టీచర్ మీద నాకు చాలా ఇష్టం ఉండేది,” అని మీనాక్షి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆమె మనస్ఫూర్తిగా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మీనాక్షి చౌదరి సినిమాల విజయాలే కాకుండా, తన నిర్భయమైన అభిప్రాయాలతో కూడా అభిమానులను అలరిస్తోంది.