Meenakshi: కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తిగత ఆధిపత్యం కాకుండా సమిష్టి నిర్ణయాలతో నడిచే సంస్థ అని పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. నాయకులందరూ సమన్వయంతో, పరస్పర గౌరవంతో పనిచేయాలని ఆమె సూచించారు.
అంజన్ కుమార్ విషయంపై స్పందించిన ఆమె, పార్టీ అతని కృషిని గమనిస్తోందని, త్వరలోనే ఆయనకు తగిన గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని తెలిపారు. “కాంగ్రెస్లో ప్రతి నాయకుడికి తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకుంటాం,” అని మీనాక్షి నటరాజన్ అన్నారు.
ఆమె ఇంకా పేర్కొంటూ, “కాంగ్రెస్ తత్వం సమిష్టి నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. మనమంతా ఒకే దిశగా పని చేస్తేనే ప్రజల నమ్మకాన్ని మరింతగా పొందగలుగుతాం” అని తెలిపారు.