Medha Patkar:ఓ పరువు నష్టం కేసు విషయంలో సామాజిక ఉద్యమకారిణి, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుత ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న వీకే సక్సేనా 2000 నాటి ఈ కేసును దాఖలు చేశారు. దీనిపై విచరాణ జరిపిన కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఇదేరోజు పోలీసులు అదుపులోకి తీసుకొని ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చారు.
Medha Patkar:2000వ సంవత్సరంలో నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారని నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సంస్థకు చీఫ్‌గా ఉన్న ఇప్పటి ఢిల్లీ ఎల్డీ వీకే సక్సేనాపై మేధా పాట్కర్ ఫిర్యాదు చేశారు. దీంతో తన పరువునకు కలిగించేలా ఓ టీవీ చానల్లో మేధాపాట్కర్ మాట్లాడారని, ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ వీకే సక్సేనా కోర్టులో రెండు పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.
Medha Patkar:అనంతరం సుధీర్ఘంగా విచారించిన కోర్టు మేధాపాట్కర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ మేరకే ఆమెను ఈ రోజు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై హక్కుల సంఘాల నేతలు అభ్యంతరాలన వ్యక్తం చేస్తున్నారు.


