Medico Student: ఇన్ని కొన్ని రోజులైతే వైద్యుడు. ప్రాణాలు నిలబెట్టే పోస్టింగ్ లో ఉండాల్సిన యువకుడు ..ప్రాణాలను విడిచాడు. మరణం వెనుక మిస్టరీలు ఉన్నా …ఆ మరణ వార్త మాత్రం ఆ ఇంట్లో విషాదం నింపింది. చదువుకోవడానికి వెళ్లిన బిడ్డ చదువు పూర్తి చేసుకుని వస్తాడు అనుకుంటే ఇలా మృత్యు వడిలోకి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది …
ఈ మధ్యకాలంలో రోజుకోక దారుణమైన సంఘటన వెలుగు చూస్తోంది. కొంతమంది యువత కారణాలు ఏమైనప్పటికీ ప్రతీసమస్యకూ ఆత్మహత్యే సరైన పరిష్కారం అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ యువ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు. విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Elon Musk: తగ్గుతున్న ఎలాంటి మాస్క్ సంపద.. ఎందుకో తెలుసా
కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి కాలేజీ హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించాడు. గదిలో తలుపులు వేసుకున్న విద్యార్ధి.. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి, తండ్రికి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.