Matka Trailer: వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మట్కా’ థియేట్రికల్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ కిశోర్ వాయిస్ ఓవర్ తో ఆరంభమైన ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ ఎలా జూద ప్రపంచంలోకి అడుగు పెట్టాడు, భార్య కాదంటున్నా ఎలా మట్కాకింగ్ గా ఎదిగాడున్నది వివరించారు.
వేలు తీసుకుని వదిలేయటానికి నేనేం ద్రోణాచార్యను కాదు… మట్కాకింగ్ వంటి డైలాగ్స్ బాగా పేలతాయి. ఇక వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, గెటప్స్ ఆకట్టుకుంటాయి. నోరో ఫతేహి బార్ డాన్సర్ గా నవీన్ చంద్ర ఓ ముఖ్య పాత్రలో, కన్నడ కిషోర్ విలన్ గా ఆకట్టుకుంటారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 14న విడుదల కాబోతోంది. జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, రవీంద్రవిజయ్, రవిశంకర్ కీలక పాత్రలను పోషించారు. మరి ‘మట్కా’తో వరుణ్ తేజ్ ప్లాఫ్ ల పరంపరకు అడ్డు కట్టపడుతుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

