Suryapet: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో గంజాయి పట్టుబడింది. మారుమూల పల్లెలకూ గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఎంతగా తనిఖీలు చేస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎక్కడ పడితే అక్కడే గంజాయి విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ మహా నగరం నుంచి మారుమూల పల్లెల వరకూ గంజాయి వ్యాపించడంపై పోలీసులూ గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
Suryapet: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని కోదాడ రోడ్డులో గంజాయి పట్టుబడింది. ట్యాంకర్‌లో తరలిస్తుండగా మేళ్లచెరువు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎక్కడెక్కడ గంజాయిని దాచి ఉంచారు, ఎక్కడెక్కడ అమ్మకాలు చేశారు.. అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.