Maria Sharapova: అందం..ఆట కలగలిసిన అద్భుతం రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా. 5 గ్రాండ్ స్లామ్ లు గెలుచుకుని అరుదైన కెరీర్ స్లామ్ పూర్తి చేస్తున్న మరియా షరపోవాకు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకుంది.
2004లో 17 ఏండ్ల వయసులో వింబుల్డన్ గెలిచిన మరియా టెన్నిస్ ప్రపంచంలో సంచలనంగా మారింది. 2006లో యుఎస్ ఓపెన్.. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్.. 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు గెలిచి కెరీర్‌స్లామ్ పూర్తి చేసిన పది మంది టెన్నిస్ స్టార్స్ లో ఒకరిగా నిలిచింది. 2004లో వాల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన మరియా 2012 ఒలింపిక్స్లో సిల్వర్ గెలిచింది. కెరీర్లో మొత్తంగా 36 టైటిల్స్ సాధించింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్‌గా నిలిచిన తొలి రష్యా అమ్మాయి కూడా షరపోవానే. గాయాలు వేధించడం, ఆటేతర విషయాలు, వివాదాలతో 2020లో 32 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలికింది మరియా షరపోవా.