Marco

Marco: ఐదు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసిన మార్కో

Marco: ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ సినిమా మలయాళ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 1న తెలుగులో దీనిని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

ఇది కూడా చదవండి: Dry Fruits: ఈ సమస్యలు ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినొద్దు

Marco: ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్. అతను నటించి వయొలెంట్ మూవీ ‘మార్కో’ను హనీఫ్ అదేని డైరెక్ట్ చేశారు. షరీఫ్ ముహమ్మద్ దీనిని నిర్మించారు. నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా కబీర్ దుహన్ ‘మార్కో’లో కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. మరి మలయాళ చిత్రసీమలో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న ‘మార్కో’ని తెలుగువారు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

కొత్తపల్లి గీత తనయుడి పెళ్ళిలో ఆర్టిస్టుల సందడి!

పరుచూరి రామ కోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్ వివాహం అక్షతతో హైదరాబాద్ లో జరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, నటులు వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *