Maoist Party: ఆపరేషన్ కగార్ ముందుకు సాగుతున్నది. పదుల సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు ఘటనలు మరోవైపు కొనసాగుతున్నది. మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్న కేంద్ర ప్రభుత్వం గడువు సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఇటీవలే హిడ్మా సహా పలువురు కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో హతులయ్యారు. వందలాది మంది మావోయిస్టులు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో లొంగిపోయారు.
Maoist Party: ఈ తరుణంలో మావోయిస్టు పార్టీ కీలక లేఖ చర్చనీయాంశంగా మారింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే.. ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖను మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసింది. ప్రాణనష్టాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.
Maoist Party: పార్టీ నిర్ణయంపై అంతర్గతంగా చర్చించుకునేందుకు 2026 ఫిబ్రవరి 15వ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేస్తే ఎంఎంసీ జోన్లలో ఉన్న మావోయిస్టులు అందరూ సామూహికంగా లొంగిపోతామని కూడా ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఇటీవలే లొంగుబాటు అంశంపైనా ఆ పార్టీలో తీవ్రమైన చర్చ జరిగిందని సమాచారం. దానిపై భిన్న చర్చలు జరిగాయని, రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

