Maoist: మావోయిస్టు పార్టీ అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దంతెవాడ–బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని కేశ్కుతుల్ అడవుల్లో ఇవాళ ఉదయం నుంచి భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు హతమయ్యారు, అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఘటన స్థలం నుంచి నాలుగు మృతదేహాలతో పాటు పెద్దఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసినట్టు చెప్పారు.
‘ఆపరేషన్ కగార్’లో భాగంగా భైరామ్గఢ్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ బృందాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు సుమారు 50 మంది మావోయిస్టులు చేరినట్టు సమాచారం ఉండడంతో భద్రతా దళాలు వారిపై వెంటనే మెరుపుదాడి జరిపినట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్ ఘటనకు సంబంధించి కూడా అధికారులు స్పందిస్తూ, నామినేషన్ పత్రాలు చోరీ చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

