Mantralayam: ఆంధ్రప్రదేశ్‌లోని మార్చి 1 నుంచి ఆరో తేదీ వరకు మంత్రాలయంలోని గురు వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు శ్రీ మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ వెంకటేశ్ జోషి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేశ్ కోణాపూర్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మార్చి 1న ఊంజల మండపంలో రాఘవేంద్ర స్వామి 404 పాదుకా పట్టాభిషేక మహోత్సవం, 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
Mantralayam: మంత్రాలయంలోని గురు వైభవోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ విశేష పూజలు నిర్వహిస్తారు. 5న టీటీడీ నుంచి విశేష వస్త్రాల సమర్పణ, యోగేంద్ర మంటపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన ప్రముఖులు, న్యాయమూర్తులకు గురువైభవోత్సవ పురస్కారాలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అందించనున్నారు.
Mantralayam: ఈ ఉత్సవాలకు ఏపీ మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ భరత్, ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులకు అవార్డులు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.