Manmohan Singh: మాజీ ప్రధాని దివంగత మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని శక్తిస్థల్‌లో శనివారం జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలను ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో దివంగత నేత మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం ప్రకటించింది.
Manmohan Singh: ఢిల్లీలోని మన్మోహన్ అధికారిక నివాసమైన మోతిలాల్ నెహ్రూ మార్గ్ 3కి పార్థీవదేహాన్ని ఎయిమ్స్ నుంచి గురువారం రాత్రే తరలించారు. ఈ సమయంలో రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం మన్మోహన్ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి, అక్కడే కాంగ్రెస్ నేతలు, శ్రేణులు నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియల కోసం శక్తిస్థల్‌కు తరలించనున్నారు.
Manmohan Singh: ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నది. 1991 అక్టోబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మన్మోహన్ తుదిశ్వాస విడిచే వరకు నిబద్ధత కలిగిన రాజకీయ వేత్తగా కొనసాగారని పలువురు ప్రముఖులు కొనియాడారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను చేపట్టిన వ్యక్తిగా ఆయన చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, ఖర్గే, రాహుల్ సహా పలువురు నేతలు, వివిధ రాజకీయ పక్షాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు తదితరులు హాజరవుతారు.