Manchu Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో మునిగిన ఆ ఫ్యామిలీలో తాజాగా మరో వివాదం చెలరేగి, కేసుల దాకా వెళ్లింది. జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్లిన మోహన్‌బాబు.. ఇంటి సమస్యను చక్కదిద్దుకునే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జర్నలిస్టులకు, జర్నలిస్టు కుటుంబాలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆయన తన ఇంటి సమస్యపై మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
Manchu Mohan Babu: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మోహన్‌బాబు చిన్న తనయుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక వెళ్లేందుకు యత్నించగా, అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో వర్సిటీ, మోమన్‌బాబు పర్సనల్ సిబ్బందికి, మనోజ్‌కు వాగ్వాదం చోటుచేసుకున్నది. దూషణల పర్వం కొనసాగింది.
Manchu Mohan Babu: ఈ సమయంలో జరిగిన వివాదంపై ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు మేరకు మంచు మనోజ్, మౌనికతోపాటు మరో ముగ్గురిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. తనపై, తన భార్య మౌనికపై దాడికి యత్నించారంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మోహన్‌బాబు పీఏతోపాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.