Manchu family: మంచు ఫ్యామిలీ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఫ్యామిలీ తన మార్క్ నుచూపిస్తూ ఉంటుంది. కానీ గత రోజులుగా ఈ ఫ్యామిలీ లో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూచాయి. ఈ క్రమంలోనే మంచి ఫ్యామిలీలో అంతర్యుద్ధం నడిచింది. అసలు గత రెండు రోజులుగా ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చూద్దాం..
గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ కూడా తమ స్పందన పీఆర్ టీం ద్వారా తెలియజేస్తోంది. మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్ల డ్రామా చోటుచేసుకుంది. తనని తన తండ్రి కొట్టాడని మంచు మనోజ్ మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా పహాడి షరీఫ్ సీఐ గురువా రెడ్డి షాకింగ్ విషయం బయట పెట్టారు. అదేమంటే మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదట.. మోహన్ బాబుపై కానీ కుటుంబ సభ్యులపై కానీ మనోజ్ ఫిర్యాదు చేయలేదని అన్నారు.తన ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని, తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారని వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశా కానీ వారు పారిపోయారు నాకు గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నాకు నా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉంది అని మనోజ్ చెప్పారని అయితే తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదని అంటున్నారు.
మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయని తెలిపినట్టు సీఐ వెల్లడించారు. అంతేకాక ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని మనోజ్ కి చెప్పమని పేర్కొన్న సీఐ అసలు డయల్ 100 కి కాల్ రాగానే మేము రెస్పాండ్ అయ్యామని ఘటనా స్థలానికి చేరుకున్నామని వెల్లడించారు.