RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా ఆయన ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో నియమితులయ్యారు. దాస్ పదవీకాలం డిసెంబర్ 10, 2024తో ముగుస్తుంది. డిసెంబర్ 11 నుంచి మల్హోత్రా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 9న సంజయ్ మల్హోత్రా నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
శక్తికాంత దాస్ 12 డిసెంబర్ 2018న గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయన పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించారు. ఆయన ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.
సెంట్రల్ బ్యాంక్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జూలై-సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయినందున వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బిఐపై ఒత్తిడి పెరుగుతోంది. దాస్ హయాంలో, ద్రవ్యోల్బణం ప్రమాదం కారణంగా RBI దాదాపు రెండేళ్లపాటు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
ఇది కూడా చదవండి: High Court: RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
RBI Governor: రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి అయిన సంజయ్ మల్హోత్రా, IIT కాన్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, USA నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని చేశారు.
మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులతో సహా వివిధ రంగాలలో పనిచేశారు. ఆయనకు 33 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ సెక్రటరీగా పనిచేయడానికి ముందు, ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు. మల్హోత్రా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఫైనాన్స్- టాక్సేషన్‌లో ఎక్స్ పర్ట్.