Air India Flight: ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిని లైంగికంగా వేధించిన కేసులో 23 ఏళ్ల యువకుడిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని జనక్‌పురికి చెందిన 28 ఏళ్ల యువతి విమానంలో తన పక్కనే కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దక్షిణ గోవాలోని డబోలిమ్‌లోని గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత మహిళ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వేధింపులకు పాల్పడిన హర్యానాలోని పానిపట్‌కు చెందిన జితేందర్ జుంగియాన్ అనే వ్యక్తిని దబోలిమ్ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Manas Sarovar Yatra: భక్తులకు శుభవార్త! మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 75 – లైంగిక వేధింపులు, 79 – మహిళ ను కించపరిచే చర్యలు, దూషణలు, అనుచితమైన సంజ్ఞలు లేదా గోప్యతకు భంగం కలిగించడం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళపై విమానంలో వేధింపులకు గురికావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఓ వృద్ధురాలిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడంతో పాటు కొందరు ఆమెను అనరాని మాటలతో దుర్భాషలాడిన ఘటన జరిగింది.