Mammootty: మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి 73 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆసక్తికర విషయం బయటపడింది! ఆయన రుచి చూసే శక్తిని కోల్పోయారని, అది తిరిగి పొందడం ఒక్క రాత్రిలో జరిగిన మ్యాజిక్ కాదని ఆయన సన్నిహితుడు వెల్లడించారు. ఈ సమస్యని మమ్ముట్టి ఎలా ఎదుర్కొన్నారు? పూర్తి వివరాలు చూద్దాం!
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ కు 28 ఏళ్లు..
మమ్ముట్టి కొంతకాలం పాటు రుచి, వాసనలను కోల్పోయారని ఆయన సన్నిహితుడు VK శ్రీరామన్ వెల్లడించారు. ఈ ఆరోగ్య సమస్య సమస్య నుంచి మమ్ముట్టి క్రమంగా కోలుకునేందుకు చికిత్స, ఓపిక అవసరమైందట. మమ్ముట్టి ఈ సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. ఆయన ఆరోగ్య పునరాగమనం అభిమానులకు స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు మమ్ముట్టి చాలా హెల్తీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.