Vishwambhara

Vishwambhara: విశ్వంభర: గ్రాఫిక్స్ కోసం 75 కోట్లు!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ ప్రేక్షకుల్లో అపూర్వ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్‌తో సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సంచలన వార్త సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం మాత్రమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ ఏ స్థాయిలో ఉండబోతుందో అభిమానులు ఊహించుకోవచ్చు. ‘విశ్వంభర’లో చిరంజీవితో పాటు త్రిష, అషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Teja Sajja: తేజ సజ్జా కొత్త ప్రయాణం: కోలీవుడ్లో భారీ ప్రాజెక్ట్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *