Road Accident

Road Accident: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

Road Accident: ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ శివారులో గత అర్ధరాత్రి భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, నందిగామ బైపాస్‌లోని అనాససాగరం వద్ద ఉన్న ఫ్లై ఓవర్‌పై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది ప్రయాణికులలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: PM Modi: రేపు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన

కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు, ఫ్లై ఓవర్‌పై లారీని ఓవర్‌టేక్‌ చేయబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం, ముఖ్యంగా ఎడమ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన 8 మంది క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *