అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు సౌత్ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగువారు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు.

