Mahesh kumar goud: మంత్రి పొంగులేటి పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ 

Mahesh kumar goud: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి⁶. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చేసిన ప్రకటనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.

మహేష్ గౌడ్ మాట్లాడుతూ – “ఇలాంటివి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు. ఇలాంటి కీలకమైన విషయాలను ఏకపక్షంగా మీడియా ముందు వెల్లడించడం సరికాదు” అన్నారు. మరో మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అంశాలపై ఇతరులు వ్యాఖ్యానించడం తగదని, అది గందరగోళానికి దారితీస్తుందన్నారు.

అంతేకాదు, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు ఎంతగానో జాగ్రత్త వహించాలన్నారు. పార్టీ పిలుపు లేకుండా ఎవరు వ్యక్తిగతంగా ప్రకటనలు చేయకూడదని మహేష్ గౌడ్ హెచ్చరించారు.

“ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రతి ఒక్కరు సమన్యంతో పనిచేయాలి. విభేదాల నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే పార్టీ నేతలతో సంప్రదించి, కేబినెట్ నిర్ణయాల అనంతరం మాత్రమే ప్రకటించాలి” అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై ఒక స్పష్టత వచ్చిందని, మంత్రులు పార్టీ విధానాలను అనుసరించాలని ఆయన సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *