Mahesh kumar goud: ఆర్మూర్‌లో పాదయాత్రలో మాట్లాడిన మహేశ్ గౌడ్, “బీసీలకు న్యాయం కావాలంటే, వారి హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ బీజేపీలో ఉన్న బీసీ ఎంపీలు మాత్రం మౌనం వీడడం లేదు. కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే, మిగతా నేతలు నోరు ఎందుకు మెదపడం లేదు?” అంటూ ప్రశ్నించారు.
మోడీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు
“ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు ఏ మాత్రం న్యాయం చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. బీసీల కోసమే కాదు, ప్రతి సామాన్య పౌరుడి హక్కుల కోసమే మా జనహిత పాదయాత్ర,” అని మహేశ్ గౌడ్ వివరించారు.
బీజేపీ దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతోది
బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, “వాళ్లు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. మతాన్ని హింసకు హేతువుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఈ కుటిలతను గుర్తించాలి,” అన్నారు.
కాంగ్రెస్‌లోనే సామాన్య కార్యకర్తలకు ఎదిగే అవకాశం
“ఒక సామాన్య కార్యకర్త పీసీసీ స్థాయికి ఎదగడం ఒక్క కాంగ్రెస్‌లోనే సాధ్యమవుతుంది. అందుకే ఓపికతో పనిచేయండి, మీకు సరైన సమయంలో పదవులు ఖచ్చితంగా వస్తాయి,” అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ప్రజల ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి
“ప్రతిపక్షాలు గ్రామాల్లో విమర్శలు చేస్తుంటే, ఊరుకోకూడదు. వారిని నిలదీయాలి—‘మీరు పదేళ్లు ఏమి చేశారు?’ అని ప్రశ్నించాలి. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి,” అని సూచించారు.

