Globe Trotter: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సినిమా నుంచి బిగ్ రివీల్ నవంబర్ 15న విడుదల కానుంది. ఈ ఈవెంట్‌ను ఇండియాలోనే అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌గా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Anupama: అనుపమకు ఆన్లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సినిమా నుంచి నవంబర్ 15న భారీ రివీల్ రానుంది. మహేష్ బాబు, రాజమౌళి జోడీ ఈ చిత్రంతో ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఇండియాలోనే అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌గా మేకర్స్ ప్రకటించారు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో 100 అడుగుల భారీ తెరపై కంటెంట్ ప్రదర్శించనున్నారు. మహేష్ ఫ్యాన్స్‌తోపాటు ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ ప్రత్యేక సర్ప్రైజ్లు సిద్ధం చేశారు. ఈ ఈవెంట్లో ఆశ్చర్యకర ఎలిమెంట్స్ అబ్బురపరచనున్నాయి. ఈ రివీల్‌తో ‘గ్లోబ్ ట్రాటర్’ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Mark the #GlobeTrotter’s words…
Gear up for November 15th… @urstrulymahesh 🤗🤗🤗@thetrilight— S S Karthikeya (@ssk1122) November 8, 2025

