Mahesh Babu: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో ప్రిన్స్ మహేశ్ బాబు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటాడు. ఎంతో తెలిసిన వారి సినిమాల విషయంలోనే అతను సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతాడు. అయితే… నయన తార బర్త్ డే సందర్భంగా ప్రసారం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ మహేశ్ బాబుకు బాగా నచ్చినట్టుంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో లవ్ ఎమోజీతో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇదిలా ఉంటే నయన్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న ‘రక్కయి’ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

