Deputy CM Ajit Pawar

Deputy CM Ajit Pawar: నీకెంత ధైర్యం..? మహిళా ఐపీఎస్‌ అధికారితో డిప్యూటీ సీఎం వాగ్వాదం

Deputy CM Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన షోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. షోలాపూర్ జిల్లాలోని కుర్దు గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు అందింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు, గ్రామస్థులు అక్కడికి వచ్చి అధికారులతో గొడవకు దిగారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి అంజనా కృష్ణతో మాట్లాడాలని కోరారు. అజిత్ పవార్ ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారు. తాను ఉప ముఖ్యమంత్రిని అని చెప్పి చర్యలను ఆపాలని ఆదేశించారు.

Also Read: Nepal: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అసలు కారణం ఇదే!

అయితే, అంజనా కృష్ణ ఫోన్‌లో మాట్లాడుతున్నది నిజంగా అజిత్ పవారేనా అని నిర్ధారించుకోవాలని కోరారు. దీనికి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీకు ఎంత ధైర్యం? నేను మీపై చర్యలు తీసుకుంటాను” అని హెచ్చరించారు. వెంటనే ఆయన అంజనా కృష్ణకు వీడియో కాల్ చేశారు. ఆ సమయంలో ఆమె నేలపై కూర్చొని ఆయనతో మాట్లాడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనపై ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే స్పందిస్తూ, అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి ఆయన అలా మాట్లాడి ఉండవచ్చునని, అక్రమ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ మద్దతివ్వరని వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనపై అంజనా కృష్ణ గానీ, ఇతర అధికారులు గానీ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. మొత్తం సంఘటనపై స్పందిస్తూ, ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే మాట్లాడుతూ, వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *