Exit Poll Results 2024

Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ లో డబుల్ ఇంజన్ సర్కార్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

Exit Poll Results 2024: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్‌ పూర్తయింది. నవంబర్ 23న ఫలితాలు వస్తాయి. ఎన్నికలు పూర్తి అయినవెంటనే ఎగ్జిట్ పోల్స్ తెరమీదకు వచ్చాయి. మహారాష్ట్రలో 11 ఎగ్జిట్ పోల్స్‌లో 6 బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేసింది. మిగిలిన 4 ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ కూటమి అంటే మహావికాస్ అఘాడీకి మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. ఒకే ఒక్క సంస్థ మాత్రం  హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసింది. 

జార్ఖండ్‌లో 8 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటిలో బీజేపీ కూటమి 4, ఇండియా  కూటమి 2 చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అంచనా వేశాయి.  మిగిలిన 2 ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను సూచించాయి.

ఇది కూడా చదవండి: Kerala: స్వామియే శరణమయ్యప్ప.. పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 10 గంటల సమయం

మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌ 15న ప్రకటించారు. జార్ఖండ్‌లోని 81 స్థానాలకు 2 దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 20న మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ జరిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: భారీ భూకంపం . . సునామీ హెచ్చరికలు జరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *