TGSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 200 కోట్ల మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ ప్రయాణాల విలువ ₹6,700 కోట్లుగా నమోదు అయిందని ఆర్టీసీ ప్రకటించింది.
మహాలక్ష్మి పథకం విజయగాథ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఈ పథకం, మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఊతమిచ్చింది. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అనే సౌకర్యంతో, గత 18 నెలలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది.
ఆర్టీసీ కీలక నిర్ణయాలు
మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టాలని. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మహాలక్ష్మి పథకం విజయవంతం వెనుక డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందంతా కీలక పాత్ర పోషించారు” అని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Crime News: బైక్ కొనివ్వడం లేదని.. పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య
రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
200 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయి సందర్భంగా సంబరాలు చేయనున్నారు దీనిలో భాగంగా. ఈరోజు ఉదయం 10 గంటలకు MGBSలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
- 97 ఆర్టీసీ డిపోలు
- 341 బస్ స్టేషన్లలో
ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్టీసీకి లాభాలు
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఆదా చేసుకుంటున్నారనే కాకుండా, ఆర్టీసీ వినియోగం కూడా పెరిగింది. దీంతో ఆర్టీసీకి ఆదాయ వృద్ధి, సేవల విస్తరణ సాధ్యమవుతోంది.