AP Politics

AP Politics: మండలిలో వైసీపీ బాక్సులు బద్దలేనా!?

AP Politics: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. అయితే ఇప్పటిదాకా వినిపించిన పేర్లు వేరు.. ఫైనల్‌ లిస్టులో కనిపించిన పేర్లు వేరు. ట్రాక్‌ రికార్డ్‌, సర్వీస్‌ రికార్డు‌‌, సినియార్టీ‌.. ఇలా అర్హతల్ని బట్టి చూసుకుంటే.. పాతిక మంది ఆశావహులు కనబడుతున్నారు. కానీ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా.. ఆ లేడీ సింగం పేరు ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి ఆశ్చర్యపరిచారు సీఎం చంద్రబాబు. ఇంతకీ ఎవరా లేడీ సింగం? ఆమెను పెద్దల సభకు పంపుతుండటం వెనుక బాబు వ్యూహం ఏమిటి? లెట్స్‌ వాచ్‌ ద స్టోరీ.

1995 బాబు ఈజ్‌ బ్యాక్‌. ప్రస్తుతం వింటేజ్‌ చంద్రబాబును చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన నిర్ణయాల్లో అలాంటి సెన్సేషన్సే కనబడుతున్నాయ్‌. నా చుట్టూ తిరుగుతూ భజన చేసే వాళ్లు వద్దు.. క్షేత్ర స్థాయిలో ఉంటూ పార్టీకి, ప్రజలకు పనులు చేసే వాళ్లు ముద్దు… అంటూ బహిరంగంగానే చెప్పేస్తున్నారాయన. ఇక పాలనలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ చంద్రబాబుకు యువనేత లోకేష్‌ ఆలోచనలు తోడవుతున్నాయి. దీంతో లాబీయింగులు చేస్తే కాదు.. పార్టీ భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే వాళ్లకే పదవులు అన్నట్లు ఆ పార్టీలో క్రమంగా సీన్‌ మారిపోతూ వస్తోంది. వైసీపీకి టెర్రర్‌, యంగ్‌ లీడర్‌ కావలి గ్రీష్మకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి వరించడం అందులో భాగమే అంటున్నారు విశ్లేషకులు.

గత ఐదేళ్లు ప్రతిపక్షంలో టీడీపీ ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో.. 2022లో నిర్వహించిన తెలుగుదేశం మహానాడుకు… ఆ పార్టీకి ఎన్నో సమస్యలు.. మరెన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు మహానాడుకు వచ్చేందుకు వీలుగా బస్సుల్ని ఏర్పాటు చేయాలంటే ఎదురుదెబ్బలు. ప్రైవేటు బస్సులు కూడా దొరక్కుండా జగన్ ప్రభుత్వం కుట్రలు, బెదిరింపులు. ఆర్టీసీ బస్సులకు డబ్బులు చెల్లిస్తామన్నా బస్సులు ఇవ్వని వైనం నాటి జగన్‌ ప్రభుత్వానిది. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక అదే మహానాడు వేదికగా టీడీపీలో ఒక కొత్త ఫైర్ బ్రాండ్‌ తలుక్కున మెరిసింది. ఆ ఫైర్‌ బ్రాండ్‌ పేరే కావలి గ్రీష్మ ప్రసాద్‌. ఆనాడు ఆమె ఇచ్చిన స్పీచ్‌.. మహానాడు నిర్వహణకు కార్యకర్తలు, నేతలు అప్పటి దాకా పడ్డ కష్టాన్ని మరిపించింది.

ఇది కూడా చదవండి: TSPSC: సెలెక్టెడ్ జేఎల్‌ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌

మిస్టర్‌ జగన్‌ రెడ్డి! కావలి గ్రీష్మ పేరు చెప్తే.. వైసీపీ నేతల చెవుల్లో నేటికీ మారుమోగుతుంది ఈ డైలాగ్‌. నాడు మహానాడులో ఈ లేడీ సింగం.. వైసీపీ సర్కారు మీద విరుచుకుపడిన తీరు అలాంటిది. పదునైన విమర్శలతో వైసీపీ సర్కారును ఉతికి ఆరేసిన చందంగా ఆమె మాటలు.. మహానాడుకు హాజరైన వారిని విపరీతంగా ఆకర్షించాయి. కావలి గ్రీష్మ లాంటి యువ నేతలు పార్టీకి ఆయుధంగా మారతార్న అభిప్రాయంతో పాటూ…. ఇంతకీ ఎవరీమె? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న ఆరా అప్పట్లోనే మొదలైంది. వైసీపీ సర్కారుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి, కసికి రూపంగా కావలి గ్రీష్మాను అభివర్ణించారు పలువురు రాజకీయ పరిశీలకులు. ఆమె మాట్లాడిన భాషపై అభ్యంతరాలున్నప్పటికీ.. ఆమెలోని ఉద్వేగం, అందుకు దారితీసిన పరిస్థితులపైనే ఆనాడు ప్రజల్లో చర్చ జరిగింది. అసలు మైకు పట్టుకొని గ్రీష్మ మాట్లాడుతుంటే… జగన్‌ రెడ్డితో నేరుగా కొట్లాడినట్లే అనిపించింది తెలుగు తమ్ముళ్లకు. మహానాడుకు హాజరైన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఈలలు.. కేకలతో ఆమె ప్రసంగానికి జేజేలు పలికారు. అన్నింటికి మించి.. తొడ కొట్టి మరీ వైసీపీకి చేసిన హెచ్చరిక టీడీపీని కొత్త జోష్‌లోకి తీసుకెళ్తే… వైసీపీకి పీడకలను మిగిల్చింది.

ALSO READ  Naidu Big Plan For AP: దేశానికి యుద్ధ విమానాలు అందించే స్థాయికి ఏపీ!

ఈ సరికొత్త మహిళా ఫైర్ బ్రాండ్ ఎవరన్న ఆరాను గూగులమ్మతో మొదలు పెడితే.. ఆనాడు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ఇంతకీ కావలి గ్రీష్మ ఎవరో కాదు.. టీడీపీలో సుదీర్ఘకాలం సేవలు అందించిన సీనియర్ నేత.. ఉమ్మడి ఏపీకి తొలి మహిళా స్పీకర్‌గా వ్యవహరించిన ప్రతిభా భారతి రాజకీయ వారసురాలే గ్రీష్మ. ప్రతిభా భారతి కుమార్తె అయినప్పటికీ.. ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. తన ఇమేజ్‌ను తానే సొంతంగా తెచ్చుకోవాలన్న పట్టుదల గ్రీష్మలో కనిపిస్తుంది. 2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ తరఫున పని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా.. రాజాం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ బాధ్యురాలిగా గ్రీష్మ వ్యవహారించారు. గ్రీష్మ తల్లి స్పీకర్‌గానే కాకుండా, ఏపీ మంత్రిగా కూడా పనిచేశారు. గ్రీష్మ తాత కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా, ఎమ్మెల్యేగా పని చేసారు. పదవులు ఉన్నా లేకున్నా ఆ కుటుంబం ఆది నుండి టీడీపీలోనే కొనసాగుతోంది.

ఉన్నత విలువలు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చిన కావలి గ్రీష్మ… గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. అయితే అప్ప‌ట్లో చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీ ఇచ్చిన సందర్భం కూడా లేదు. అయితే పార్టీ పట్ల నిబద్ధత, ఆమెకున్న ఫైటింగ్‌ స్పిరిట్‌ వల్ల పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే గ్రీష్మకు నామినేటెడ్ పదవి దక్కింది. రాష్ట్ర మహిళ ఆర్దిక సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నేడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ యువ మహిళా నాయకత్వానికి పట్టం కట్టారు సీఎం చంద్రబాబు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *