శివయ్య అంటే మాటలా చెప్పండి . . శివ నామస్మరణ చేయాలన్నా ఎంతో పెట్టి పుట్టాలంట. అలాంటిది మహా శివ జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే . . దానికి మహా సంకల్పం కావాలి . మహా వంశీకి ఆ ఆదిదేవుడు అటువంటి సంకల్పాన్ని కలిగించాడు . సనాతన ధర్మాన్ని నలుదిశలా ప్రతిధ్వనించేలా ఓంకార నాదంతో . . శివ నామ స్మరణతో మహా శివరాత్రి మహోత్సవాన్ని ఉత్సాహంగా జరిపిస్తున్నారు మహా వంశీ. వార్తలు . . వినోదం వీటితో ప్రజలకు నిత్యం అనుసంధానమై ఉన్న మహా గ్రూప్ . . ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు తన వంతుగా ఒక చిన్న తులసి మొక్కలా ఆధ్యాత్మిక పరిమళాలను మోసుకు రావడానికి మహా భక్తి ఛానల్ తీసుకు వస్తున్నారు మహా వంశీ . మహా కుంభమేళా ముగింపు రోజు . . మహా శివరాత్రి పర్వదిన మహా జాగరణ ఉత్సవ వేళలో అతిరధ మహారధులు హాజరు కాగా శివోహం అంటూ తెలుగు ప్రజల కోసం మహా జాగరణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా శివోహం కార్యక్రమాన్ని వీక్షించారు . మహా వంశీని అభినందించారు .
ఆర్ఫీ పట్నాయక్ శివోహం అంటూ పాడుతున్న వేళా చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ హాజరైన ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

