Maganti Gopinath: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తున్నది. గతకొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించిందని సన్నిహితులు తెలుపుతున్నారు.
Maganti Gopinath: గత నాలుగు రోజులుగా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉంటున్నట్టు బంధువులు కూడా తెలిపారు. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోయినా ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఇటీవలే ఆసుపత్రిలో చేరినట్టు చెప్తున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతుండగా, బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఆయన త్వరలో కోలుకోవాలని పలువురు కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. కొందరు ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. ఆరోగ్యంతో ఆయన ఆసుపత్రి నుంచి తిరిగిరావాలని వేడుకుంటున్నారు.