NEET Results: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితాలు విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. నీట్ ఫలితాలపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది. ఇదిలాఉండగా.. తమ పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం వల్ల పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని చెన్నైకి చెందిన కొందరు విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా జరిగినప్పుడు తమ కోసం ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని కూడా చెప్పారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది. తాజాగా మద్రాస్ హైకోర్టు కోర్టు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు కూడా ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ఫలితాలకు సంబంధించిన తేదీపై ఇంకా స్పష్టత లేదు.
Also Read: Ponguleti srinivas: నలుగురి స్వార్థం కోసం ధరణి తెచ్చారు
NEET Results: 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 4న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 20.8 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష ఫలితాలపై మాత్రం క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమకు అన్యాయం జరగకూడదని కోరుతున్నారు.