Mad Square

Mad Square: USలో రికార్డులు సృష్టిస్తున్న “మ్యాడ్ స్క్వేర్”!

Mad Square: ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా నటించారు. ఇక మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో, పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ప్రామిసింగ్ గా ఉంది. దీంతో మ్యాడ్ స్క్వేర్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ఇంకా రిలీజ్ కాకుండానే ప్రీసేల్స్ లో అదరగొడుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా లక్ష డాలర్స్ మార్క్ ని దాటినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా కోసం అక్కడ ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. మార్చ్ 28న చాలా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *