M4M: యు.ఎస్.ఎ.కు చెందిన జో శర్మ హీరోయిన్ గా నటించిన ‘ఎం 4 ఎం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. దీనిని ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. నూట పది సంవత్సరాల సినీ చరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ రాలేదని మోహన్ వడ్లపట్ల అంటున్నారు. ఎం 4 ఎం అంటే మోటివ్ ఫర్ మర్డర్ అని ఇది వరల్డ్ వైడ్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అని ఆయన చెబుతున్నారు. ఇందులో తాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించానని జో శర్మ తెలిపారు.
