LPG New Rates: 2025 సంవత్సరారంభంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఈ సారి స్వల్పంగా తగ్గడం గమనార్హం. కేవలం 14.50 రూపాయల మేర తగ్గింది. ఈ తగ్గుదలతో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1804 రూపాయలకు చేరింది. అదే విధంగా హైదరాబాద్ నగరంలో 2014 రూపాయలకు చేరింది. ఈ ధరలు జనవరి 1న బుధవారం నుంచే అమలులోకి వస్తాయి. ముంబైలో 1756 రూపాయలు, చెన్నై నగరంలో 1966 రూపాయలు, కోల్‌కతాలో 1911 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర చేరింది.
LPG New Rates: మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో గృహ వినియోగదారులు ఉసూరుమన్నారు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తాయి. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో ఈ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
దానిలో భాగంగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.