Auto Johnny: ఆటోజానీ’… డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్. చిరంజీవితో సినిమా చేయాలనుకుని పూరి సిద్దం చేసుకున్న కథ ఇది. ఇటీవల వరుస పరాజయాలను ఫేస్ చేస్తున్న పూరి కమ్ బ్యాక్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్న టైమ్ లో సోషల్ మీడియాలో ‘ఆటోజానీ’ సందడి మొదలైంది. గతంలో రెడీ చేసిన ‘ఆటోజానీ’ స్క్రిప్ట్ ను చిరంజీవికి నెరేట్ చేశాడు పూరి. అయితే ప్రథమార్ధం బాగున్నా ద్వితీయార్ధం నచ్చని కారణంగా హోల్డ్ లో పెట్టాడు చిరు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ని మెగాస్టార్కి సరిపోయేలా మార్చి రెడీ చేసి మరోసారి నెరేట్ చేయటానికి రెడీ అవుతున్నాడట పూరి. ఒక వేళ చిరు నో చెబితే ఈసారి నాగార్జునకు వినిపిస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. గతంలో పూరి నాగార్జునతో ‘శివమణి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీశాడు. సో కథ నచ్చితే నాగ్ కూడా నో అనకపోవచ్చు. ఏది ఏమైనా ‘ఆటోజానీ’ సినిమా పూరి జగన్నాథ్ రెడీ చేసే స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంది. మరి చిరు, నాగ్ లో ‘ఆటో జానీ’గా మారేది ఎవరో చూద్దాం.