Shilpa Shetty: బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యాపారవేత్తను రూ. 60 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో ముంబై పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు శిల్పాశెట్టి దంపతులు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేసు వివరాలు
ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారిని శిల్పాశెట్టి దంపతులు సుమారు రూ. 60 కోట్ల మేర మోసం చేశారని గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు ఆగస్టు 14న నమోదైనప్పటి నుంచి శిల్పాశెట్టి దంపతులు తరచుగా విదేశాలకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు వారి ప్రయాణ వివరాలను (ట్రావెల్ హిస్టరీ) పరిశీలిస్తున్నారు.
విచారణ వేగవంతం
ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ కంపెనీకి చెందిన ఆడిటర్‌ను కూడా పోలీసులు విచారించారు. దేశం విడిచి వెళ్లకుండా వారిని నిలువరించడానికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలోనే వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.