Lokesh Kanagaraj: నాని ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఒకటి సొంత సినిమా ‘హిట్ 3’ కాగా, మరొకటి ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా. అయితే… వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే నాని తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తొకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ వంటి సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు లోకేశ్ కనకరాజ్. అంతేకాకుండా ఓ ఫిల్మీ యూనివర్స్ ను సృష్టించాడు. అతను ఏ సినిమా చేసిన ముందు సినిమాలోని పాత్రలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇందులో ప్రభావం చూపుతుంటాయి. తనకు అనుకూలంగా ఈ పాత్రలను వేరొక సినిమాలు కలుపుతూ ముందుకు పోవాలన్నది లోకేశ్ ఆలోచన. ఇప్పుడు నానితో అతను చేయబోయే సినిమాకూ ఆ యూనివర్శ్ పరిధిలోకే వస్తుందని అనుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
