Banking Laws: బ్యాంకింగ్ సవరణ బిల్లు 2024 లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బ్యాంకింగ్ సవరణ బిల్లు కింద అనేక ముఖ్యమైన మార్పులు చేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, ఇతర చట్టాలను ఈ బిల్లు సవరిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో మొత్తం 19 సవరణలు ప్రతిపాదించారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ఆమోదించింది.
ఇది కూడా చదవండి: M.S.Raju: ఒకటే మాట.. అభివృద్ధే బాట..
కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, మనం ఇప్పుడు ఒక బ్యాంక్ ఎకౌంట్ కు నలుగురు నామినీలను యాడ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేయని మొత్తం సరైన వారసునికి చేరేలా చూసేందుకు ఈ మార్పు చేస్తున్నారు. మార్చి 2024 వరకు, బ్యాంకుల్లో దాదాపు రూ. 78,000 కోట్లు ఉన్నాయి. ఈ సొమ్ముపై ఎలాంటి క్లెయిమ్ చేయలేదు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, బ్యాంకింగ్ కంపెనీల స్వాధీన చట్టంలో ప్రభుత్వం సవరణలు చేస్తోంది. ఈ సవరణతో, 7 సంవత్సరాల పాటు క్లెయిమ్ చేయని డివిడెండ్, షేర్లు, వడ్డీ, మెచ్యూర్ బాండ్‌ల మొత్తాన్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే IEPFకి బదిలీ చేయవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు ఐఈపీఎఫ్ ద్వారా తమ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు ఇప్పుడు రాష్ట్ర సహకార బ్యాంకులో కూడా పని చేయవచ్చు.
సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు ఇప్పుడు రాష్ట్ర సహకార బ్యాంకులో కూడా పని చేయవచ్చు. సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ప్రస్తుతం 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచనున్నారు.
అయితే, ఈ నియమం ఛైర్మన్ – పూర్తికాల డైరెక్టర్లకు వర్తించదు. గ్రామీణ, వ్యవసాయ ప్రాంతాలలో సౌకర్యాలను అందించడానికి సహకార బ్యాంకులు స్థాపించారు. ఇప్పుడు సహకార బ్యాంకులన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆడిటర్ల ఫీజులను నిర్ణయించే హక్కును పొందుతాయి. ఉన్నత స్థాయి ప్రతిభావంతులను నియమించుకుంటాయి. ఇది బ్యాంకు ఆడిట్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఆర్‌బిఐకి రిపోర్ట్ చేసే టైమ్ గడువును మార్చుకోవడానికి బ్యాంకులకు అనుమతి:
బ్యాంకింగ్ సవరణ బిల్లు 2024 కొత్త చట్టం ప్రకారం, బ్యాంకులు RBIకి రిపోర్టింగ్ గడువును మార్చడానికి అనుమతి లభిస్తుంది. ఇప్పుడు ఈ నివేదికను 15 రోజులు, ఒక నెల, త్రైమాసికం ముగింపులో ఇవ్వవచ్చు.
ఇంతకు ముందు బ్యాంకులు ప్రతి శుక్రవారం ఆర్‌బీఐకి నివేదికలు సమర్పించాల్సి వచ్చేది. బ్యాంకింగ్ సవరణ బిల్లు 2024లో ప్రతిపాదించిన సవరణలు బ్యాంకుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా పెట్టుబడిదారులు, ఖాతాదారుల ప్రయోజనాలను కూడా పరిరక్షిస్తాయి.