Local Body Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియలు చేపట్టింది. తీరా కోర్టులు అంగీకరించక, బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు మొగ్గు చూపింది. ఈ దశలో ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నది.
Local Body Elections: తొలుత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీర్మానించింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.3,000 కోట్ల వరకు రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. ఈ నిధులు 2026 మార్చి వరకు ఎన్నికలు జరిగితే ఆయా స్థానిక సంస్థలకు విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ ఎన్నికలు జరగకపోతే మార్చి తర్వాత ఆ నిధులు మురిగిపోయే అవకాశం ఉన్నది. అందుకే పరిషత్ ఎన్నికలను రిజర్వేషన్లు తేలాకే నిర్వహించాలని, ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధపడింది.
Local Body Elections: ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు కసరత్తును చేపట్టింది. ఇందులో భాగంగానే పంచాయతీల్లో ఓటరు జాబితాల సవరణకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ రోజు నుంచి నవంబర్ నెల 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశాలను జారీచేసింది. నవంబర్ 20వ తేదీ నాటికి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణకు అవకాశం కల్పించింది.
Local Body Elections: అదే విధంగా నవంబర్ 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా వెల్లడి, పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా జారీచేశారు.
Local Body Elections: డిసెంబర్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రిమండలి సూచనల మేరకు పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం కసరత్తును మొదలుపెట్టాయి. ఈ కసరత్తును అనుసరించి డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నది. అదే నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసే యోచనలో ఉన్నది.

