Liquor Brands:

Liquor Brands: తెలంగాణ‌లో త్వ‌ర‌లో కొత్త ర‌కం మ‌ద్యం బ్రాండ్లు

Liquor Brands:తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి కొత్త ర‌కం మ‌ద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కొత్త ర‌కం మ‌ద్యం బ్రాండ్ల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. ఈ మేర‌కు 604 ర‌కాల బ్రాండ్ల‌కు ద‌ర‌ఖాస్తులు అందిన‌ట్టు రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్ల‌డించింది. వీటిలో 331 ర‌కాలు ఇండియ‌న్ బ్రాండ్లు కాగా, 273 విదేశీ ర‌కం మ‌ద్యం బ్రాండ్ల నుంచి ద‌ర‌ఖాస్తులు అందినట్టు స‌మాచారం. తెలంగాణ‌లో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న మ‌ద్యం అమ్మ‌కాల‌ను మ‌రింత‌గా పెంచేందుకే ఈ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది. అధికారంలో ఎవ‌రు ఉన్నా మ‌ద్యం అమ్మ‌కాల నుంచి అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందే చ‌ర్య‌లు తీసుకుంటున్నట్టు విశ్లేష‌కులు తెలుపుతున్నారు.

Liquor Brands:47 కొత్త కంపెనీల నుంచి 386 ర‌కాల బ్రాండ్ల కోసం ద‌ర‌ఖాస్తులు రాగా, 45 కంపెనీల నుంచి 275 ర‌కాల బ్రాండ్ల అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్టు అధికారులు తెలిపారు. ఈ 604 మ‌ద్యం బ్రాండ్ల అమ్మ‌కాల కోసం 92 మ‌ద్యం స‌ర‌ఫరా కంపెనీలు అనుమ‌తులు తెచ్చుకున్న‌ట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. టీజీబీసీఎల్ అనుమ‌తితో గ‌త ఫిబ్ర‌వ‌రి 23న కొత్త బ్రాండ్ల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న అనంత‌రం ప్ర‌భుత్వ అనుమ‌తితో కొత్త బ్రాండ్ల అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *