Mahabharatham: మహా భారతాన్ని తీసే సాహసం చేస్తున్నారు తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి. అయితే మహాభారతం మొత్తం కాదు. మొత్తం సినిమాగా తియ్యాలంటే అది కత్తి మీద సాము లాంటిది. అందుకే మహాభారతం లోని కేవలం అర్జునుడు, అభిమన్యుల కథను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు లింగు స్వామి. ఈ భాగాన్ని 700 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు.దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేని లింగుస్వామి ఈ చిత్రాన్ని ఎంత వరకు విజయవంతంగా తెరకెక్కిస్తారో, సినిమా విజువల్స్, సాంకేతిక పరిజ్ఞానం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటాయో అన్నది చూడాలి. లింగు స్వామి తెలుగులో పందెం కోడి, ఆవారా లాంటి డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

