Vizag: విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈస్ట్ఇండియా పెట్రోలియం కంపెనీ (EIPL)లో ఊహించని అగ్నిప్రమాదం సంభవించింది. పిడుగు పడటంతో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై మంటలు చెలరేగి, భారీగా పొగలు ఎగిసిపడ్డాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందించి, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Congress: 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోలియం నిల్వ ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని మొదట భావించారు. అయితే, కంపెనీ సిబ్బంది త్వరగా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చకుండా నివారించగలిగారు.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మరియు EIPL ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అవసరమైతే క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. అధికారులు త్వరగా స్పందించి, సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
బిగ్ బ్రేకింగ్
జోరున వర్షం.. HPCLలో భారీ అగ్నిప్రమాదం
EIPL ఎనర్జీ (గతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్) పెట్రోలియం ట్యాంక్ ఫామ్‌లో అగ్నిప్రమాదం
పెట్రోలియం ట్యాంక్ పై పడిన పిడుగు.. POL, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కంపెనీ
మంటలను అదుపు చేస్తున్న… pic.twitter.com/5rEkxWwptK
— Telugu Feed (@Telugufeedsite) September 7, 2025

