ENG vs IND

ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు లెజెండరీ క్రికెటర్ల పేర్లు

ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ జట్ట మధ్య జూన్ 20 నుండి ఐదు మ్యాచులు టెస్టు సిరీస్ జరగబోతుంది. ఇప్పటకే ఇంగ్లాండ్ టీమ్ జట్టును కూడా ప్రకటించింది. భారత్ సరికొత్తగా ఈ సారి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆడబోతుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ జరుగుతుండగా ఈ సిరీస్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినీయర్లు లేకపోవడం వలన ఈ సారి యువ ఆటగాళ్లపై ఒత్తిడి మరింత పెరిగిందనుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలావుంటే ఈ టెస్ట్ సిరీస్‌కు ట్రోఫీకి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల పేరు పెట్టారు.

ఇది కూడా చదవండి: Bengaluru Stampede: తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్టు

వారోవరో కాదు చిన్ టెండూల్కర్-జేమ్స్ ఆండర్సన్. ఇది ఇద్దరు గొప్ప టెస్ట్ క్రికెటర్లకు ఇచ్చే గౌరవం. జూన్ 20న హెడింగ్లీ వేదికగా ఈ 5 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. దీనికి ముందు టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. కాగా సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ చరిత్రలో 15,921 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. సచిన్ 1989 నుండి 2013 వరకు 22 సంవత్సరాల కాలంలో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇంగ్లాండ్ తరఫున -జేమ్స్ ఆండర్సన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు , టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్ లో ఒకరైన జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్ లో ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. 42 సంవత్సరాల వయసులో అతను తన రిటైర్ మెంట్ ప్రకటించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RCB vs LSG Weather Report: RCB-లక్నో మ్యాచ్ సమయంలో లక్నోలో వాతావరణం ఎలా ఉంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *