Shah Rukh Khan: షారుక్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన నిందితుడు మహ్మద్ ఫైజాన్ ఖాన్‌ను ముంబై పోలీసులు మంగళవారం రాయ్‌పూర్ లో అరెస్టు చేశారు. బెదరింపులపై షారూక్ సిబ్బంది బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసు విచారణ ప్రారంభమైంది. షారుక్‌ను బెదిరించడానికి ఉపయోగించిన ఫోన్ నంబర్ రాయ్‌పూర్‌లో నివసిస్తున్న ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాది పేరు మీద నమోదైంది.
రిపోర్ట్స్ ప్రకారం, మంగళవారం ఉదయం ముంబై పోలీసు CSP అజయ్ సింగ్, అతని బృందం ట్రాన్సిట్ రిమాండ్ కోసం రాయ్‌పూర్ చేరుకున్నారు. ఇక్కడ ఫైజాన్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈరోజు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇది కూడా చదవండి: Allu Arjun Fans VS Yash Fans: యశ్ వర్సెస్ బన్నీ… ఫ్యాన్స్ వార్!?
Shah Rukh Khan: బెదిరింపు వచ్చిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఫైజాన్ ఖాన్ వద్దకు చేరుకున్నారు. అయితే నవంబర్ 14న తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ముంబై వస్తానని ఫైజాన్ తెలిపాడు. షారుక్‌ను బెదిరించిన నంబర్ తనదే అనీ.. అయితే, ఈ బెదిరింపు సంఘటనకు 3-4 రోజుల ముందుఅంటే నవంబర్ 2న తన మొబైల్ ఫోన్ పోయిందని ఫైజన్ తన ప్రాథమిక ప్రకటనలో చెప్పాడు.