Latest Telugu News: వాతావరణం మారుతున్నది. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో? తెలియని పరిస్థితి ఏర్పడుతున్నది. ఏటా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా వేసవి కాలంలో ఆ మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండలు వేసవి ఆరంభమైన మార్చిలోనే షురూ అయ్యాయి. భానుడి భగభగలు నెలారంభంలోనే మొదలయ్యాయి. దీంతో వేడి, ఉక్కపోతతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడి పోతున్నారు.
Latest Telugu News: గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎండ తీవ్రతతో వడగాల్పులు కూడా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Latest Telugu News: శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. కనీసం ఉదయం నుంచే ఎండతీవ్రత నెలకొంటుంది. రాబోయే రోజుల్లో వేడిగాలులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత త్వరగా ఇండ్లలోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.