Mass Jathara: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ, యంగ్ స్టార్ శ్రీలీల కలయికలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తోన్న ఈ చిత్రం మొదట మేలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రవితేజ లుక్తో కూడిన డైనమిక్ పోస్టర్ను విడుదల చేసి, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపించనున్నారని, శ్రీలీలతో ఆయన కెమిస్ట్రీ మరోసారి ఆకట్టుకోనుందని టాక్. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాయి. ఈ గణేష్ చతుర్థి సీజన్లో ‘మాస్ జాతర’ సందడి ఖాయం!
Eesari Ganesh Utsavam theatres lo jarupukundham 🤗#MassJathara AUGUST 27th ❤️#MassJatharaOnAug27th pic.twitter.com/TBQEXSAkbS
— Ravi Teja (@RaviTeja_offl) May 29, 2025