Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్ర వెళ్లే దారిలో సోన్‌ప్రయాగ సమీపంలోని ముంకటియా వద్ద వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో గురువారం కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ముంకటియా స్లైడింగ్ జోన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో రహదారి పూర్తిగా మూసుకుపోయిందని, దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.
గౌరికుండ్ నుండి తిరిగి వస్తున్న కొంతమంది యాత్రికులు స్లైడింగ్ జోన్‌లో చిక్కుకున్నారని, అయితే వారిని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది రక్షించి సోన్‌ప్రయాగ్‌కు సురక్షితంగా తీసుకువచ్చారని వారు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా కేదార్‌నాథ్ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేశారు.