Lakshmi Perumal: సికింద్రాబాద్.. నేరాలను నియంత్రించడంతోపాటు నేరస్తులను చాకచక్యంగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో పాట్ మార్కెట్ జువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే మొండా మార్కెట్,పాట్ మార్కెట్ లలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు.
ఇది కూడా చదవండి: Vizag: స్టీల్ ప్లాంట్ రక్షణకు మరో ఉద్యమం
దుకాణాలలో దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లు, దారిదోపిడీలు ఇటీవల కాలంలో పెరిగినప్పటికీ నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు అనువైన సాధనాలుగా పనిచేస్తున్నాయని అన్నారు. సీసీ కెమెరాలు రికార్డింగ్ సంబంధిత పోలీస్ స్టేషన్ కు లింక్ చేయడం ద్వారా శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించవచ్చని అన్నారు. ఉత్తర మండల పరిధిలోని ఇతర ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సీసీ కెమెరాల మూలంగా దొంగతనాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.