Lakshmi Manchu:

Lakshmi Manchu: ఇదేం దిక్కుమాలిన ప్ర‌శ్న‌.. ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుపై న‌టి మంచు ల‌క్ష్మి ఫిర్యాదు..

Lakshmi Manchu: ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసిన ఓ జ‌ర్న‌లిస్టుపై అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. ఆయ‌న ప్ర‌శ్న‌ల‌తో అవాక్క‌వ‌డం ఆమె వంతయింది. ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న‌ది. జ‌ర్న‌లిస్టు అంటే ఎలాంటి ప్ర‌శ్ననైనా అడ‌గొచ్చా? బాడీ షేమింగ్ చేసేలా ఉండే ప్ర‌శ్న‌లు వేయ‌వ‌చ్చా? అంటూ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఆ జ‌ర్న‌లిస్టుపై ఏకంగా ఫిల్మ్ చాంబ‌ర్‌లోనే ఆమె ఫిర్యాదు చేశారు.

Lakshmi Manchu: త‌న‌ను ఓ జ‌ర్న‌లిస్టు ఇంట‌ర్వ్యూ చేశార‌ని, ఆ స‌మ‌యంలో ఆయ‌న అడిగిన ఓ ప్ర‌శ్న‌తో త‌న గౌర‌వానికి భంగం క‌లిగింద‌ని మంచు ల‌క్ష్మి తెలిపారు. అస‌లు అది ఇంట‌ర్వ్యూలా లేద‌ని, అటాక్ చేసిన‌ట్టుగా ఉన్న‌ద‌ని తెలిపారు. ఇది అస‌లు జ‌ర్న‌లిజ‌మే కాద‌ని, క‌నీసం విమ‌ర్శ కూడా కాద‌ని, పాపుల‌ర్ కావ‌డం కోసం, వైర‌ల్ చేయ‌డం కోసం ఇలాంటి పిచ్చి ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ని ఆరోపించారు.

Lakshmi Manchu: జ‌ర్న‌లిస్టులంటే త‌న‌కు గౌర‌వం ఉన్న‌ద‌ని, కానీ పురుషాధిక్య‌త ఉన్న‌ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి నిల‌దొక్కుకొని ఉన్నాన‌ని మంచు ల‌క్ష్మి తెలిపారు. ఇలాంటి విష‌యాల‌పై మౌనంగా ఉంటే ఇదే వైఖ‌రి కొన‌సాగుతుంద‌ని, అందుకే తాను ఫిల్మ్ చాంబ‌ర్‌లో ఆ జ‌ర్న‌లిస్టుపై ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఫిల్మ్ చాంబ‌ర్‌ను తాను కోరిన‌ట్టు తెలిపారు.

Lakshmi Manchu: ద‌క్ష‌.. ది డెడ్లీ కాన్ఫిరెసీ అనే చిత్రం ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న మంచు ల‌క్ష్మి ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు ఆమె ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఓ వివాదాస్ప‌ద ప్ర‌శ్న అడిగారు. అయితే ఆ ప్ర‌శ్న‌కు ఆమె నుంచి ఊహించ‌ని విధంగా స‌మాధానం వ‌చ్చింది. ఇదే ప్ర‌శ్న‌ను పురుష హీరోల‌ను అడ‌గ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. దీంతో ఖంగుతునడం ఆ విలేక‌రి వంత‌యింది. సోష‌ల్ మీడియాలో అది వైర‌ల్ కావ‌డంతో నెటిజన్లు మంచు ల‌క్ష్మికి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *