Nayanthara: లవ్ యాక్షన్ డ్రామా తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళీ స్టార్ నివిన్ పౌలీ డియర్ స్టూడెంట్స్ లో కలిసి నటిస్తున్నారు. సందీప్ కుమార్-జార్జ్ ఫిలిప్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నారు. నివిన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.
Also Read: Koratala Siva: దేవర 2 పక్కన పెట్టి.. యంగ్ హీరోతో సినిమా స్టార్ట్ చేసిన కొరటాల శివ..?
టీజర్ ఓపెనింగ్ లోనే నయన్ – నివిన్ మధ్య ఫన్నీ కన్వెర్జేషన్ అదిరిపోయింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నయన్, నివిన్ వర్క్ చేస్తున్న రెస్టారెంట్ కి రావడం, డియర్ స్టూడెంట్స్ పేరుతో కొంతమంది విద్యార్థులను పరిచయం చేస్తూ.. కాలేజీలో వారు చేసే అల్లరిని చూపిచండం, చివర్లో నయన్ పోలీస్ అని ట్విస్ట్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నయన్ స్టైల్ అండ్ స్వాగ్, యాక్షన్ అదిరిపోయింది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి.

